UPDATED 11th DECEMBER 2017 MONDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో ఈ నెల 22, 23 తేదీల్లో "ఎక్స్ పెరిమెంటల్ టెక్నిక్స్ ఇన్ వెల్డింగ్ టెక్నాలజీ" పేరిట రెండురోజుల జాతీయస్థాయి వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ లో పగ్ వెల్డింగ్, ఫైర్ వెల్డింగ్, డిపోసిషన్ ఎఫిసియన్సీ, మిగ్ అండ్ టిగ్ వెల్డింగ్, అండర్ వాటర్ వెల్డింగ్, స్పాట్ అండ్ స్మా వెల్డింగ్, స్త్రెంగ్త్ ఆఫ్ ది జాయింట్ వెల్డింగ్ తదితర వెల్డింగ్ ప్రక్రియలపై రెండురోజులు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ప్యాట్రన్ గా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్యాట్రన్ గా సతీష్ రెడ్డి, చైర్మన్ ఫర్ వర్క్ షాప్ గా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, రిసోర్స్ పర్సన్ గా ప్రొఫెసర్ డాక్టర్ టి.శ్రీధర్ (ఐఐటి ఢిల్లీ) వ్యవహరిస్తారన్నారు. కో-ఆర్డినేటర్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ప్రొఫెసర్ వి. శ్రీనివాసరావు, కొ కో-ఆర్డినేటర్స్ డాక్టర్ శరవణన్, ఎస్.సాగర్, హెచ్. సురేష్ బాబు, వై.కె.ఎస్.సుబ్బారావుల పర్యవేక్షణలో ఈ వర్క్ షాప్ నిర్వహించబడుతుందన్నారు. దీనిలో పాల్గొనదలిచినవారు రూ. 500/- రిజిస్ట్రేషన్ రుసుముగా చెల్లించి కళాశాల వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ కావొచ్చన్నారు. మరిన్ని వివరాలకు www.acet.ac.in చూడవచ్చన్నారు.







