UPDATED 4th SEPTEMBER 2018 TUESDAY 6:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు మంగళవారం డెంగ్యూ వ్యాధికి సంబంధించి ప్రత్యేక వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. వేట్లపాలెం పిహెచ్ సి వైద్యాధికారి శ్రీనివాసనాయక్ ఆధ్వర్యంలో వైద్య బృందం గ్రామస్తులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. జిల్లా పరిషత్ సిఇవో బి. విద్యాసాగర్ ఈ శిబిరాన్ని సందర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిడివో జగ్గారావు మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, చెత్తా చెదారాలు లేకుండా చూడాలని అన్నారు. ఎవరైనా జ్వరం, తుమ్ములు, దగ్గుతో బాధపడుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. అలాగే గ్రామంలో నలుగురికి రక్తం శాంపిల్స్ సేకరించి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి పంపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు ముమ్మిడి శ్రీనివాసరావు, పోతుల శ్రీనివాస్, ఏఎన్ఎంలు జి.వి.వి.ఎస్. కుమారి, జి. నవయుగ, ఏ. లక్ష్మీ, సూపర్ వైజర్లు సి.హెచ్. ప్రకాష్, కె. సత్యవతి, ఆశ, తదితరులు పాల్గొన్నారు.







