UPDATED 7th FEBRUARY 2018 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులకు బడ్జెట్ పై అవహగాన కల్పించేందుకు"బడ్జెట్ 2018 -19" పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.విశాలాక్షి అధ్యక్షతన, మెహర్జీ దువ్వూరి సమన్వయకర్తగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎం.బి.ఎ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్. ఉదయ్ భాస్కర్, చార్టెడ్ అకౌంటెంట్ వి.వి.ఎస్. కిరణ్ హాజరై మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్ వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, స్టాక్ మార్కెట్, మధ్యతరగతి తదితర రంగాలపై ప్రభావం చూపుతుందని, పర్యాటక, తీరప్రాంత అభివృద్ధి రంగాలు నిర్లక్ష్యం చేయబడ్డాయన్నారు. అనంతరం అతిధులను డాక్టర్ సుగుణారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిజిడిఎం, ఎంబీఏ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







