బ్లాక్ చైన్ టెక్నాలజీపై గైట్ లో ముగిసిన వర్క్ షాప్

UPDATED 24th FEBRUARY 2018 SATURDAY 5:30 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) క్యాంపస్ లో రెండు రోజులు పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీపై నిర్వహించిన వర్క్ షాప్ శనివారంతో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా హాక్ మేనియా వ్యవస్థాపకులు సిటివొ ప్రశాంత విశ్వనాథం మాట్లాడుతూ విలువైన సమాచారాన్ని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచి లావాదేవీలను నేరుగా జరుపుకునేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని అన్నారు. గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ బ్లాక్ చైన్ టెక్నాలజీపై శిక్షణ పొందిన యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని, రెండు రోజులు జరిగిన ఈ వర్క్ షాప్ లో గైట్ క్యాంపస్ కు చెందిన సుమారు ఐదు వందల మంది విద్యార్థులు బ్లాక్ చైన్ టెక్నాలజీపై శిక్షణ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామ్మూర్తి, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.        
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us