ఆదిత్యలో విజయవంతంగా ఉచిత దంతవైద్య శిబిరం

UPDATED 9th DECEMBER 2017 SATURDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల ఫార్మసీ కళాశాలలో శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలవరకు నిర్వహించిన ఉచిత దంతవైద్య శిబిరం విజయవంతంగా ముగిసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఫార్మసీ కళాశాలల వార్షిక కార్యక్రమంలో భాగంగా తమ సంస్థలో పనిచేస్తున్న అధ్యాపక, అధ్యాపకేత సిబ్బందికి కాకినాడకు చెందిన ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఎస్.వి. వెంకటేష్, డాక్టర్ శివ సువర్ణ దంతపరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహాలు, ఉచితంగా మందులు అందచేశారన్నారు. డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ దంతాల సంరక్షణలో అధిక శాతం ప్రజలు అశ్రద్ధ వహిస్తున్నారని, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు  ఉత్పన్నమౌతున్నాయని, దంతాల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. దివాకర్, టెక్నీషియన్ ఎస్. విజయ, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us