Annavaram : మెట్టుమెట్టుకూ వందనం..వైభవంగా సత్యదేవుని మెట్లోత్సవం

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: అన్నవరం సత్యదేవుని మెట్లోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఉదయం 8 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో కొండ పైనుంచి దిగువకు తీసుకువచ్చారు. తొలి పావంచాల వద్ద వైదిక బృందం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈవో వి.త్రినాథరావు దంపతులు తొలిమెట్టు వద్ద హారతి వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు మెట్టు మెట్టుకూ పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించి, నైవేద్యం సమర్పించి కర్పూర హారతి వెలిగిస్తూ పూజలు చేస్తూ కొండపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us