పేదలకు జీసస్ మినిస్ట్రీస్ సంస్థ ఆర్ధికసాయం

UPDATED 20th FEBRUARY 2018 TUESDAY 7:30 PM

సామర్లకోట: పేదలకు ఆర్థికసాయం చేయాలనే సంకల్పంతో విదేశాల్లో స్థిరపడిన జిల్లాకు చెందిన స్థానికులు పట్టణంలోని రెండవ వార్డులో ఏర్పాటు చేసిన జీసస్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా వికలాంగులు, అనాధలకు ప్రతీ నెల రూ. మూడు వందలు పింఛన్లు అందచేస్తున్నామని సంస్థ అకౌంటెంట్ బోడపాటి నాగలక్ష్మి తెలిపారు. దీనిలో భాగంగా పట్టణంలోని ఐదుగురిని గుర్తించి జిల్లా మానవ హక్కుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో రూ. మూడు వందలు వంతున అందచేశారు. ఇండియన్ ఆర్గనైజర్స్ గా ప్రతీ నెల రూ. మూడు వందలు వంతున 115 మందికి ఆర్ధిక సాయం అందచేస్తునట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ఉపాధ్యక్షుడు జుత్తుక అప్పారావు, కార్యదర్శి కుంచే నాని, సభ్యులు ఎస్. రెహమాన్, ఎం.డి. వల్లీ భాషా, లింగం గంగాధర్, ద్వారంపూడి శ్రీను, బోడపాటి వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు.     

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us