రైతులకు బహుముఖ సేవలను అందించేందుకే రైతుభరోసా కేంద్రాలు

రంపచోడవరం, 30 మే 2020 (రెడ్ బీ న్యూస్): రైతులకు బహుముఖ సేవలందించే రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఓ వినూత్న వ్యవస్థ అని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఆన్నారు. డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ తో కలిసి స్థానిక జాగరంపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వ్యవసాయ రంగ పరికరాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను స్థాపించిందన్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గించేలా రైతులకు మెళకువలు ఈ కేంద్రాలలో నేర్పుతారన్నారు. రైతు భరోసా కేంద్రంలో అంతర్భాగంగా ఉన్న విజ్ఞాన కేంద్రం పెట్టుబడి ఖర్చు తగ్గించి సాగును లాభసాటిగా చేయడమే ఈ కేంద్రాల లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా రైతులయొక్క నందేహాలను నివృత్తి చేస్తారన్నారు. జీడిమామిడి మొక్కలు 50 శాతం రాయితీపై అందించడం జరుగుతోందన్నారు. ఏ ఎరువు ఎందుకు అవసరమో, ఎంత మోతాదు వాడాలో చెబుతారన్నారు. వీడియోలు, ఆడియోలు సహాయంతో మెళకువలు నేర్పుతారన్నారు. రైతు సంక్షేమమే వరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం వనిచేస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవెర్చుతుందన్నారు. కియోస్కీ ద్వారా రైతు తమకు కావాల్సిన వాటిని ఆర్డరు చేస్తే సరఫరా చేస్తారన్నారు. భూసార పరీక్షలు చేయించుకునే సౌకర్యాలు ఉన్నాయన్నారు. విజ్ఞాన కేంద్రాలులో సేంద్రీయ ఎరువులైన జీవామృతం, ఘనజీవామృతం, వేపాకు కషాయం వంటి వాటి తయారీలో శిక్షణలు ఇస్తారన్నారు. రైతు భరోసా కేంద్రంలో రెండు ప్రధాన విభాగాలు ఉంటాయని ఒక డిజిటల్ కియోస్కీ, రెండవది వర్కుషాప్ శిక్షణ విభాగమన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితరాలను క్లిక్ చేస్తే ఆర్డరు తయారవుతుందని, అది సమీపంలో ఆగ్రోస్ కేంద్రానికి చేరుతుందని జిల్లాకు 5 చోప్పున ఆగ్రోస్ కేంద్రాలు ఏర్పాటు కాబడ్డాయన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో రూ. 2 లక్షలు విలువచేసే వ్యవసాయాంత్రీకరణ పరికరాలు ట్రాక్టరుతో ఉపయోగించేవి అందుబాటులో ఉంటాయని వాటిని నామమాత్రపు అద్దెకు ఇస్తారన్నారు. పంటల భీమా, ఇ-కర్షక్ లో పంట నమోదు వంటి సేవలు అందు బాటులో వుంటాయన్నారు. పశుసంవర్ధక సేవలు సైతం లభిస్తాయన్నారు. పశు ఆరోగ్య సంరక్షణకార్డు చికిత్సలు, ఉచిత పశువుల భీమా వంటి వాటి వివరాలు అందుబాటులో వుంటాయన్నారు. వ్యవసాయ నిపుణులు శాస్త్రవేతల ఆలోచనాలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 11 సంస్థలు ఈ సేపలు అందించ నున్నాయన్నారు. మధ్య దళారీ వ్యవస్థల ప్రమేయం లేకుండా రైతులకు మంచి గిట్టుబాటు ధరల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఏజెన్సీ 11 మండలాల పరిధి లో 77 రైతు భరోసా కేంద్రాలున్నాయన్నారు. రైతులు ఈ కేంద్రాల్లో సాగు విధానాలలో మెళకువలు, తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంతో పంటలసాగు, అధిక దిగుబడులు సాధన, వ్యవసాయాంత్రీకరణ సాంకేతికతను అలవర్చుకొని పూర్తిగా ఆవరణలోనికి తీసుకొని వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ డీడీ కె. రమేష్ నాయక్, ఏడీ సూర్యనారాయణ మూర్తి, ఐటీడీఏ ఏపీవో నాయుడు, వ్యవసాయశాఖ ఎడి ఎన్, శ్యామల, హెచ్.వో రమేష్, ఎవో లక్ష్మణరావు, ఎంపీడీవో లక్ష్మారెడ్డి, తాహశీల్దార్ కె.లక్ష్మికళ్యాణి, కేవికే కోర్డినేటర్ లలిత, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us