RRR నుంచి మరో పాట వచ్చేసింది!

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021‌: సినీ ప్రియులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం న్యూ ఇయర్‌ కానుకను అందించింది. ‘రైజ్‌ ఆఫ్‌ రామ్‌’ పేరిట ఓ పాటను విడుదల చేసింది. ‘రామం రాఘవమ్‌ రణధీరం రాజసం’ అంటూ అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ పాటలో అల్లూరి పాత్రలో రామ్‌ చరణ్‌ అద్భుతంగా కనిపించారు. ఈ పాటకు కె.శివదత్త లిరిక్స్‌ అందించగా.. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. విజయ్‌ ప్రకాశ్‌, చందనా బాల కల్యాణ్‌, చారు హరిహరన్‌ బృందంగా ఈ పాటను ఆలపించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us