UPDATED 24th NOVEMBER 2022 THURSDAY 8:25 PM
NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను కొరటాల చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకోవడంతో, ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ చేసేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా తెరకెక్కించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ సినిమా నేపథ్యం నీరు కావడంతో, ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను నేలపై కాకుండా నీటిలో చేయాలని కొరటాల అండ్ టీమ్ భావిస్తుందట. అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు కొన్ని ఐల్యాండ్‌లను చుట్టేస్తున్నారట. మంచి లొకేషన్ ఫిక్స్ కాగానే, అక్కడ ఈ సినిమాకు సంబంధించిన తొలి యాక్షన్ బ్యాంగ్‌ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారట.







