UPDATED 31st JULY 2017 MONDAY 6:00 PM
గండేపల్లి: పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని అంబేద్కర్ యూనివర్సిటీ ఎచ్చెర్ల కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రంగనాథ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ లో నూతన పరిశ్రమల స్థాపనకు పరిగణనలోకి తీసుకోవలసిన ప్రాథమిక అంశాలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిశ్రమలు స్థాపించేందుకు ముఖ్యంగా అనువగు ప్రదేశం, వాతావరణ పరిస్థితులు యంత్ర సామాగ్రి కార్మికులతో పాటు మౌలిక వసతులు కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే యంత్ర సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పని నిర్ణయించడం కార్మికులకు తగిన విధంగా పని విభజన చేయడం, ప్రణాళికా బద్ధంగా పని జరిగేలాగా చూడడం వంటి మొదలైన విషయాలపై ఆయన ఇచ్చిన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుగుణా రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







