Tirumala Cheetah Attack : తిరుమలలో బాలికను చిరుత చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టు

Updated 12th August 2023 Saturday 2:20 pm

Tirumala Cheetah Attack – Postmortem Report : తిరుమలలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. అలిపిరి నగకదారిలో రాత్రి బాలిక తప్పిపోయారు. చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో మృతదేహం లభ్యం అయింది. అయితే చిన్నారిపై మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాలికను చిరుత చంపినట్లు పోస్టుమార్టం వచ్చింది. కాగా, ఘటనపై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. చిన్నారిపై దాడి చేసింది చిరుత లేక ఎగులుబంటినా అని అనుమానించారు.

చిన్నారి లక్షిత మృతి ఘటనపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తనకు కొన్ని అనుమానాలున్నాయని తెలిపారు. ఆడబిడ్డ విషయం కాబట్టి తనకెందుకో అనుమానంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాలిక రక్షిత మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. బాలికను చిరుత చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది.

తిరుమల నడకదారిలో రాత్రి తప్పిపోయిన బాలిక చిరుత బారినపడ్డారు. దీంతో చిరుత దాడి చేసి చంపేసింది.ఈ మేరకు లక్షిత తండ్రి దినేష్ శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తమ పాపను చంపింది చిరుతపులేనని ఎలుగుబంటి కాదన్నారు. ఎలుగుబంటి అంతదూరం మోసుకెళ్ళదని చెప్పారు. భవిష్యత్తులో ఏ చిన్నారికి ఇలాంటివీ జరగకూడదని కోరుకున్నారు. మరోవైపు చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత ఘటనపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘటనపై తనకు కొన్ని అనుమానాలున్నాయని తెలిపారు. ఆడబిడ్డ విషయం కాబట్టి తనకెందుకో అనుమానంగా ఉందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన నెల్లూరులో మీడియమాతో మాట్లాడారు. బాలిక తల్లిదండ్రులు దినేష్, శశికళను పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయాలని తెలిపారు. బాలిక తల్లిదండ్రులపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులు, టీటీడీ అధికారులను కోరుతున్నట్లు పేర్కొన్నారు. చిన్నారి లక్షిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

లక్షిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అధికారి ధర్మారెడ్డితో మాట్లాడాతానని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఆ కుటుంబానికి టీటీడీ తరఫున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. బాలికపై చిరుత దాడి చేసి చంపిన ఘటనా స్థలాని సీసీఎఫ్ నాగేశ్వరరావు, డీఏఫ్ఓ సతీష్ కుమార్ పరిశీలించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us