UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 05:50 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4వేల 198 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో చనిపోయారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 9వేల 317 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 88వేల 364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం 4వేల 605 కరోనా కేసులు నమోదవగా.. శుక్రవారం ఆ సంఖ్య తగ్గింది. 24 గంటల వ్యవధిలో 30వేల 886 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,369కి చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు 21,94,369 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన తాజా కేసుల్లో.. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 555 కేసులు, అత్యల్పంగా విజయనగరంలో 54 కేసులు నమోదయ్యాయి. కరోనాతో చిత్తూరులో ఇద్దరు.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 14,646కి పెరిగింది.







