UPDATED 28th JUNE 2017 WEDNESDAY 11:00 AM
పెద్దాపురం : స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఘనంగా మఖ నక్షత్ర అభిషేకం కార్యక్రమం బుధవారం జరిగింది. వేదపండితులు సి.హెచ్. హరిగోపాల శర్మ, అప్పల భానుమూర్తి, అవధాని వెంకట శాస్త్రి, ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.పుష్పనాథం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ఆఫిసియో సభ్యుడు రాయ విజయకుమార్, ఆలయ సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







