Whiskey Bottle: రూ.4 కోట్లు పలికిన విస్కీ బాటిల్..ఎక్కడంటే..!

రెడ్ బీ న్యూస్,17 జనవరి 2022: చవక ధరలకే మద్యం లభిస్తున్నా కాదని ఓ వ్యక్తి వేలం పాటలో పాల్గొని భారీ ధర చెల్లించి మరీ మద్యం సీసాను కొనుగోలు చేశాడు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాపులో 55 ఏళ్ల ఓల్డ్ విస్కీ ది యమ జాకీని వేలంలో పెట్టారు. దీన్ని సొంతం చేసుకునేందుకు రిమంది పోటీ పడగా, చివరకు చైనాకు చెందిన ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో 4,88,000 పౌండ్లకు దక్కించుకున్నాడు. అంటే భారత కరెన్సీలో ఆ విస్కీ బాటిల్ ధర సుమారు రూ. 4.11 కోట్లు అన్నమాట, రికార్డ్ స్థాయిలో విస్కీ బాటిల్ అమ్మకం జరగడంతో యూనీప్రీ డ్యూటీ ఫ్రీ సీఈవో అలీ సెస్టర్ ఆనందం వ్యక్తం చేశారు. తమ స్టోర్ లో భారీ స్థాయిలో వేలం జరగడంతో ఎయిర్ పోర్ట్ రిటైల్ లో ప్రత్యేక ఉత్పత్తులు అమ్మేందుకు సహాయపడుతుందని ఈ వేలం రుజువు చేసిందని ఆలీ తెలిపారు. దీన్ని జపాన్ కి చెందిన మిజనారో కలపతో తయారుచేసిన ప్రత్యేక బాక్స్ లో అందిస్తారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us