UPDATED 23rd DECEMBER 2017 SATURDAY 8:30 PM
పెద్దాపురం: పట్టుపురుగుల తయారీకి సంబందించిన యంత్రాలను 90 శాతం సబ్సిడీపై రైతులకు అందచేస్తున్నామని సెంట్రల్ సిల్క్‌బోర్డు ఛైర్మన్ కె.ఎం. హనుమంతప్ప తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలోగల సెంట్రల్ సిల్క్ బోర్డు కార్యాలయం, పట్టుపరుగుల కేంద్రానికి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.14 లక్షలు విలువైన రీలింగ్ యంత్రాలను సబ్సిడీపై రూ.10.25 లక్షలకు, ఆటోమేటిక్ రీలింగ్ యంత్రాలును రూ.1.40 కోట్లుకాగా సబ్సిడీపై రూ.75 లక్షలకు రైతులకు అందిస్తున్నామని, అదే ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీపై అందజేస్తామన్నారు. పంట నష్టం వస్తే వెంటనే రైతులను ఆదుకుంటామని, . రైతులకు అవగాహన కల్పించడానికి దేశమంతా తిరుగుతున్నామని, పట్టు సాగుపై కేంద్రానికి సంబంధించిన శిక్షణా కేంద్రంలో ఉచితంగా శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించి పారితోషికం అందజేస్తున్నామని తెలిపారు. సిల్క్‌బోర్డులో సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగులు, 700 మంది శాస్త్రవేత్తలు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిల్క్ బోర్డు (అనంతపురం) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఎ.శాంతన్‌బాబు, చేబ్రోలు, ఏలూరు డైరెక్టర్లు అశోక్ కుమార్, టి.వి.శ్రీనివాసరావు, పెద్దాపురం కేంద్రం టెక్నికల్ అసిస్టెంట్ ఆర్.శ్రీనివాసరావు, గాంధీ చేనేత సొసైటీ చైర్మన్ తూతిక సత్యనారాయణ, రైతులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.







