బాల కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

UPDATED 12th JUNE 2017 MONDAY 7:00 PM

పెద్దాపురం: బాల కార్మిక చట్టాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. స్థానిక సౌఖ్య లాడ్జి ఫంక్షన్ హాల్లో ప్రపంచ బాల కార్మిక నిర్మూలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొని సోమవారం మాట్లాడారు. 14 సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే యజమానికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.20 వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను చక్కగా చదివించి ప్రయోజకులను చేయాలన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పైడిపల్లి సూర్యనారాయణ (చిన్ని) మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన సదస్సులు ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. అనంతరం పలు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంక్షేమాధికారి కోరుమిల్లి రఘుపతి, ప్రముఖ న్యాయవాది అళక్కి కృష్ణ, వ్యాపారులు పాల్గొన్నారు.

 

 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us