గైట్ లో ఘనంగా ప్రారంభమైన మాగ్నస్-2018

UPDATED 9th FEBRUARY 2018 FRIDAY 10:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) కళాశాలలో జాతీయస్థాయి మేనేజ్మంట్ ఉత్సవం మాగ్నస్-2018 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల డిఎంఎస్ డైరెక్టర్, మాగ్నస్ 2018 ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజని శేషసాయి, కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ ముఖ్యఅతిధులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ రజని శేషసాయి మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యత, సృజనాత్మకత వంటి లక్షణాలను వెలికితీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని, మనదేశం ఆర్థికంగా, శక్తివంతంగా భవిష్యత్తులో తయారు చేసేందుకు నేటి విద్యార్థులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. సామాజిక భాద్యత విద్యార్థి దశ నుంచే అలవరచుకోవాలని, అలాగే వ్యక్తిత్వ వికాసం కూడా ఎంతో అవసరమన్నారు. విద్యార్థులు భాగస్వాములైతేనే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందని, అందుకు గోదావరి పుష్కరాలు ప్రత్యక్ష నిదర్శనమని, ఆ సమయంలో గైట్ కళాశాల విద్యార్థులు విశేష సేవలు అందించారన్నారు. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణరాజు (చైతన్య రాజు), కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ విశేష కృషి చేస్తున్నారని ఆమె అభినందించారు. ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు మాట్లాడుతూ బిజినెస్ ఇంటెలిజెన్స్ థీమ్ తో రెండు రోజులపాటు జరిగే మాగ్నస్-2018 లో ఫన్ గేమ్స్, మేనేజ్మంట్, కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించే ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారన్నారు. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ మాట్లాడుతూ విద్యార్థుల్లోని నాయకత్వ లక్షణాలు అభివృద్ధికి, భావప్రకటనా నైపుణ్యతకు, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విశిష్ఠ అతిధిగా హాజరైన ఓ.ఎన్.జి.సి గ్రూప్ జనరల్ మేనేజర్, హెడ్ డ్రిల్లింగ్ సర్వీసెస్ పి.కె. పాండే మాట్లాడుతూ విద్యార్థిదశలో ఇటువంటి కార్యక్రమాలలో భాగస్వాములు కావడం ద్వారా తమ ఉద్యోగ, విధి నిర్వహణకు అవసరమైన మెళుకువలు నేర్చుకుంటారని అన్నారు. అనంతరం కోకోకోలా ఇండియా లిమిటెడ్ ఉభయ తెలుగు రాష్ట్రాల సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ తేజస్వి నోరి, సేల్స్ మేనేజర్ ఎన్. వేణుమాధవరావు, తదితరులు మాట్లాడారు. గైట్ డిఎంఎస్ త్రైమాసిక జర్నల్ యెరుఁడైట్ ను ఆవిష్కరించగా, ఎంబీఏ విద్యార్థులు సమకూర్చిన దుప్పట్లును న్యూ లైట్ హోం నిర్వాహకులకు అందచేశారు. అతిధులను కళాశాల తరఫున దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యాసంస్థల సిఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామూర్తి, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి అకడమిక్ కన్సల్టెంట్  టి.వి. రావు, వివిధ విభాగాల అధిపతులు, డైరెక్టర్లు, డీన్లు, తదితరులు పాల్గొన్నారు.                               

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us