Kolusu Parthasarathy: మీడియా రిలేషన్స్‌ పోర్టల్‌ ప్రారంభం

Updated 10 November 2025 Sunday 8:30 pm

అమరావతి : రాష్ట్రంలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు రెండేళ్ల కాలపరిమితితో కూడిన అక్రిడిటేషన్లు జారీచేసేందుకు సంబంధించిన మీడియా రిలేషన్స్‌ పోర్టల్‌ను సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు సచివాలయంలోని ప్రచార విభాగంలో జరిగిన మీడియా సమావేశంలో వెబ్‌సైట్‌ను సమాచార శాఖ సంచాలకులు కేఎస్‌ విశ్వనాథన్‌తో కలసి ప్రారంభించారు. గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో వివిధ ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా ప్రతినిధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్లకై అర్హులైన మీడియా ప్రతినిధులు అందరూ ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు విధివిధానాలను మంగళవారం తెలియజేస్తామని చెప్పారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us