UPDATED 29th JANUARY 2018 MONDAY 5:00 PM
సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నిర్వహిస్తున్న పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తయిన సంధర్భంగా జగన్ కు మద్దతుగా పెద్దాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో వాక్ విత్ జగన్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలుతో ప్రారంభమైన పాదయాత్ర పాత తహసీల్దార్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్, స్టేషన్ సెంటర్, సాయిబాబా దేవాలయం వరకు జరిగింది. అనంతరం స్టేషన్ సెంటర్లో సాయిబాబా దేవాలయంలో సుబ్బారావు నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాల లక్ష్మీనారాయణ, కంటే వీర్రాఘవరావు, జిగిని వీరభద్రరావు, సామర్లకోట, పెద్దాపురం పార్టీ అధ్యక్షులు మద్దాల శ్రీను, కాపుగంటి కామేశ్వరరావు, మేకా శ్రీనివాస్, తోట అప్పారావు, పెదిరెడ్ల రామకృష్ణ, బంగారు కృష్ణ, మలిరెడ్డి వీరభద్రరావు, గోపు మురళి, నల్లల గోవిందు, సేపేని సురేష్, గుణ్ణం రామ్మోహనరావు, శెట్టిబత్తుల దుర్గారావు, తాటికొండ అచ్చిరాజు, కానేటి ఎలిజబిత్, డేగల భాస్కరావు, ధరణికోట యోహాన్, గంగిరెడ్డి కృష్ణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.







