బాపట్ల (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : గుంటూరు జిల్లా బాపట్లలో ఘరానా ముఠా చేతివాటాన్ని ప్రదర్శించింది. తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసింది. తక్కువ ధరకే బంగారం వస్తుందని మురా చేసిన ప్రచారాన్ని చూసిన తెలంగాణకు చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులు గుంటూరు వచ్చారు. గుంటూరు జిల్లా బాపట్లలోని బేతిపూడి వద్దకు వచ్చిన వ్యాపారులపై ఈ ముఠా దాడి చేసి వారి వద్దనున్న రూ. 30 లక్షలు లాక్కెళ్లింది. దీంతో బాధితులు వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.







