ఆదిత్యలో నూతన విద్యావిధానంపై అవగాహనా సదస్సు

UPDATED 6th AUGUST 2017 SUNDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో నూతన విద్యావిధానంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్నిఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మాల్దీవ్స్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పనిచేసిన డాక్టర్ సత్య విద్యార్థులకు, అధ్యాపక సిబ్బందికి నూతన విద్యావిధానం అనే అంశంపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో గ్రూప్ డిస్కషన్స్, నైపుణ్యాల అభివృద్ధి, బోధనా విధానం, సామూహిక చర్చలు ఏ విధంగా చేయాలి, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి, వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఏ విధంగా ఎదుర్కోవాలి, సైకాలజీ భాషా పరిజ్ఞానం మొదలైన విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులకు అన్నిరంగాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి,  బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, శృతిరెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ బి.వి. ఎల్. నాయుడు, గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక సిబ్బంది  పాల్గొన్నారు .  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us