ఎఎస్ఐకు ఘన సన్మానం

UPDATED 1st JUNE 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట ఎఎస్ఐ డి. వెంకటరమణ పదవీ విరమణ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయనను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు  పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం డిఎస్పీ రామారావు మాట్లాడుతూ విధి నిర్వహణలో చేసిన సేవలు ఏ ఉద్యోగానికైనా గుర్తింపు ఇస్తాయని, పదవిలో ఉన్నంత కాలం ప్రజల సంక్షేమం కోరుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీతో, నిబద్ధతతో పనిచేసి ప్రజల చేత మన్ననలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వై.ఆర్ కె. శ్రీనివాస్, సామర్లకోట ఎస్సైలు ఎల్. శ్రీనివాస్ నాయక్, లక్ష్మీకాంతం, సతీష్, సిబ్బంది పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us