Crime News: బిడ్డలతో సహా తల్లి బలవన్మరణం, మృతుల వివరాలు తెలుసుకున్న పోలీసులు

UPDATED 9th FEBRUARY 2022 Wednesday 08:00 PM

ఒంగోలు (రెడ్ బీ న్యూస్) :ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల వద్ద..బిడ్డలతో సహా తల్లి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతుల వివరాలను పోలీసులు సేకరించారు. మంగళవారం జరిగిన ఈఘటనలో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న చినగంజాం పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల వివరాలు తెలుసుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే ఎంత విచారించినా మృతుల వివరాలు లభించలేదు. ఇదిలాఉంటే బుధవారం మధ్యాహ్నం మృతుల వివరాలు లభించాయని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. మృతులు చినగంజాం మండలం కుక్కలవారిపాలెంకు చెందిన పేరంపల్లి కళ్యాణి( 32), నందినీ రెడ్డి (5), వెంకట్ అవినాష్ రెడ్డి(4)లుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాలు మేరకు దర్శి మండలం చౌటుపాలెంకు చెందిన నారాయణరెడ్డితో కళ్యాణికి వివాహం అయింది. భర్త నారాయణరెడ్డి ఉద్యోగ దృష్ట్యా వీరు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉండేవారు. అయితే ఇటీవల భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. అవి తారాస్థాయికి చేరడంతో.. కళ్యాణి తన ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం ఉదయం తాడేపల్లి నుండి కుక్కలవారిపాలెంలోని పుట్టింటికి వచ్చింది. అనంతరం ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి భర్త నారాయణరెడ్డిని అదుపులోకి తీసుకోని విచారించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us