KonaseemaThirumala Vadapalli : సింహవాహనంపై విహరించిన శ్రీనివాసుడు

UPDATED 18th OCTOBER 2022 TUESDAY 06:00 AM

Konaseema Thirumala Vadapalli: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వసంత మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అష్టకలశారాధన, తోమాలసేవ ఘనంగా జరిపారు. దుష్టగ్రహ దోష పరిహారార్థం మహాసుదర్శన హోమాన్ని నిర్వహించారు.

ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చకులు స్వామివారి పూజా కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం ప్రధాన హోమాలు, విశేషార్చాన, చతుర్వేదస్వస్తి, నీరాజన మంత్రపుష్పం జరిగాయి. కేరళ వాయిద్యాలు, డోలు, సన్నాయి, గిరిజన సంప్రదాయ నృత్యాలు, విశాఖపట్నానికి చెందిన దాండియా కోలాట బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 9 గంటలకు యోగ నారసింహ అలంకరణతో శ్రీవారు సింహ వాహనంపై ఆశీనులై మాఢ వీధుల్లో విహరించి భక్తులకు అభయహస్తం అందజేశారు.

అధిక సంఖ్యలో భక్తులు తోమాలసేవలో పాల్గొని తన్మయత్వం పొందారు. స్వర్ణకిరీటం, శఠారి, ఫ్లోరింగ్‌, కల్యాణ వేదిక దాతలు బ్రహ్మోత్సవ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు, ధర్మకర్తలు పి.సురేష్‌రాజు, మన్యం సూర్యకుమారి భాను, రెడ్డి రవీదేవి, మెర్ల వెంకటేశ్వర్లు, ఏపుగంటి కనకారావు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us