జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

UPDATED 23rd JULY 2017 SUNDAY 6:00 PM

కాకినాడ: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల సమావేశపు హాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల జిల్లా మహా సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఆదివారం మాట్లాడారు. విలేఖరులు వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని, అలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. విలేఖరులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటునట్లు పేర్కొన్నారు. అవాస్తవాలు రాస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శాంతి భద్రతలు పాటించి వార్తలు రాయాలన్నారు. జర్నలిస్టులకు కనీస వేతనాలు లేకుండా పని చేస్తున్నారని, ముఖ్యంగా గ్రామ స్థాయిలో విలేఖరులకు వేతనాలు లేవని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జర్నలిస్టులకు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, ప్రవేశపెట్టిందన్నారు. అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో కమిటీ వేయడం జరిగిందని, అలాగే మండలస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఇళ్ళ స్థలాలు మంజూరు త్వరితగతిన చేపడతామన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ పత్రికా రంగంలో పనిచేసే జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్నఅభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో వీరు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గ్రామీణ విలేఖరులకు ఇళ్ళ స్థలాలు మంజూరు, ఋణ సదుపాయం, ఆరోగ్యపరంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహకారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. అమలాపురం శాసన సభ్యుడు ఆనందరావు మాట్లాడుతూ సాంఘిక దురాచారాలను జర్నలిజమ్ ద్వారా బయటికి తీసుకొచ్చి వాటిని రూపు మాపడానికి కృషి చేశారన్నారు. జర్నలిస్టులు భావ ద్వేషాలకు, బంధుప్రీతికి అతీతంగా పనిచేయాలన్నారు. గుడా చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి శ్రద్ధగా పనిచేస్తున్న విలేఖరుల యూనియన్ ఒకే కుటుంబంగా ఉండి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి  మాట్లాడుతూ మీడియా వార్తల సేకరణలో, వాటిని ప్రజలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందన్నారు. అవసరమైతే సాంకేతిక శిక్షణా నైపుణ్యం పెంచడానికి శిక్షణ ఇస్తామన్నారు. సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఫ్రాన్సిస్ మాట్లాడుతూ అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ  అక్రిడేషన్ ఇవ్వడం జరిగిందని, జిల్లాలో 1400 మందికి అక్రిడేషన్లు ఇచ్చామని, అలాగే ప్రతీ ఒక్కరు హెల్త్ కార్డులు తీసుకోవాలన్నారు. APUWJ మాజీ అధ్యక్షుడు డి. సోమసుందరం మాట్లాడుతూ మండలస్థాయిలో పనిచేసే విలేఖరులకు అక్రిడేషన్, బస్సు పాస్, రైల్వే పాస్ ఇవ్వడం జరుగుతుందన్నారు, జర్నలిస్టులపై దాడులు నిరోధించాలని, డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో APUWJ  రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండేలా శ్రీరామమూర్తి , టిడిపి జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, APUWJ  రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, స్వాతి ప్రసాద్, రామాంజనేయులు, అడపా అప్పారావు, కె. సూరిబాబు, దుర్రాని, శివన్నారాయణ రెడ్డి, వి.సుబ్బారావు, ఎ.వి. శ్రీనివాసరావు, భూషణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us