UPDATED 19th JUNE 2017 MONDAY 11:30 AM
పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు కేశవ,పట్టాభిరామ స్వామి దేవస్థానం కార్యానిర్వాహణాధికారిగా వివి పళ్ళంరాజు అదనపు బాధ్యతలను సోమవారం స్వీకరించారు. ప్రస్తుతం ఈయన కాండ్రకోట నూకాలమ్మ దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు కట్టమూరు దేవస్థానం ఈవోగా పనిచేసిన ఏపూరి సత్యనారాయణ మురమళ్ళ వీరేశ్వరస్వామి దేవస్థానంకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో పళ్ళంరాజు ఈవోగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ సంధర్భంగా పళ్ళంరాజు మాట్లాడుతూ దేవస్థానాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఈవోకు దేవస్థానం చైర్మన్ బొడ్డు శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు శుభాకాంక్షలు తెలియచేశారు.







