UPDATED 28th JULY 2017 FRIDAY 7:30 PM
పెద్దాపురం: యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు అని పెద్దాపురం సీఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ యువతకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలోనిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్ నెస్ కార్యక్రమంలోఆయన పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని, మత్తు పదార్ధాలు వాడితే జీవితం నాశనం అవుతుందని సూచించారు. ముఖ్యంగా యువత అటువంటి విషయాలకు దూరంగా ఉండాలన్నారు. కళాశాల ఛైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, ఏవో కె.ఆర్. సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, శ్రీకాకుళం సిఐ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.







