Prabhas: ఆదిపురుష్ నుంచి అప్డేట్ అప్పుడేనా.. క్లారిటీ ఇచ్చిన ఓమ్ రౌత్!

UPDATED 8th SEPTEMBER 2022 THURSDAY 12:50 PM

Prabhas: టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ వరసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీలో ఉంటున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ‘సలార్’, ‘ప్రాజెక్ట్-K’ చిత్రాలు షూటింగ్ లో ఉండగా డార్లింగ్ నటించిన మరో మూవీ “ఆదిపురుష్” చిత్రీకరణ పూర్తీ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ప్రభాస్ గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ మూవీస్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్.. రామాయణ కథాంశంతో వస్తుంది. అయోధ్య రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తుండగా, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి లంకేశ్వరుడి పాత్రలో నటిస్తున్నాడు. టీ-సిరీస్ ఫిలిమ్స్ ఈ సినిమాని దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా, తెలుగులో ఈ సినిమా రైట్స్ ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అయితే 2023 సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

దీంతో ప్రభాస్ బర్త్ డే కి అయినా అప్డేట్ ఇవ్వాలంటున్న ఫ్యాన్స్ కోరికను ఒక విలేఖర్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించగా ఓమ్ రౌత్ బదులిస్తూ.. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజున అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మరి ప్రభాస్ బర్త్ డే రోజున ఆదిపురుష్ టీం ఎటువంటి అప్డేట్ ఇస్తుందో చూడాలి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us