TTD: 10 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లు జారీ: టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుపతి (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కరోనా దృష్ట్యా తిరుపతి వాసులకే సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం తిరుపతిలో 5 చోట్ల సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ధర్మారెడ్డి పేర్కొన్నారు. టోకెన్ల జారీ కేంద్రాలను శనివారం ధర్మారెడ్డి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. "వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి 10న ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తాం. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డి పల్లె, సత్యనారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాలలు, బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో టికెట్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేశాం. వైకుంఠ ద్వార దర్శనానికి స్థానికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5 వేల చొప్పున 50 వేల సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తాం. టికెట్ల కోసం వచ్చే భక్తులు క్యూలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. టికెట్లు పొందిన భక్తులను ముందురోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అలిపిరి మార్గం నుంచి తిరుమలకు అనుమతిస్తాం"దర్మారెడ్డి తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us