మావుళ్ళమ్మ సన్నిధిలో హీరో రాంచరణ్

Updated 19th April 2017 Wednesday 1:30 PM

భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఆరాధ్య దేవత మావూళ్లమ్మ అమ్మవారిని ప్రముఖ సినీ హీరో రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్యం అమ్మవారి ఆశీస్సులు అందజేయగా.. ఆలయ ఇన్‌చార్జి ఈవో ఎన్‌.ఎస్‌. చక్రధర్‌రావు, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, సభ్యులు వారికి శేషవస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందించారు. అనంతరం రాంచరణ్ దంపతులు మాట్లాడుతూ అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్‌. స్వామినాయుడు, జిల్లా అధ్యక్షుడు వండపల్లి రమేష్‌నాయుడు, పట్టణ అధ్యక్షుడు చల్లా రాము, పలువురు అభిమానులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us