సత్యదేవుని కళ్యాణానికి సర్వం సిద్ధం

Updated 2nd May 2017 Tuesday 10:00 AM

అన్నవరం : ఈ నెల 5 నుంచి 11 వ తేదీ వరకు జరిగే సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు సర్వం సిద్ధం అయింది. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగించి  రావణ వాహనం, పొన్న వాహనం, వెండి రథం, ఆంజనేయ వాహనం, గరుడ వాహనం, గజ వాహనాలను సుందరంగా తీర్చిదిద్దారు. మరోవైపు విద్యుత్తు దీపాలంకరణతో సర్వాంగ సుందరం గా తీర్చి దిద్దారు. ఆరో తేదీన రాత్రి స్వామి వారి దివ్య కళ్యాణమహోత్సవం జరగనున్న నేపధ్యంలో కల్యాణాన్ని తిలకించడానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కల్యాణం జరిగే ఆలయ ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటుచేసి వీఐపీలు, భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కల్యాణ వేదికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక చేశారు. 5న స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలను ఉత్సవాలు చేయడంతో ప్రారంభమై, 6న కల్యాణం, 7న ఉత్సవమూర్తులను రావణవాహనంపై వూరేగించడం, 8న పండిత సదస్యం, 9న వనవిహారోత్సవం, 10న చక్రస్నానం, 11న శ్రీపుష్పయాగంతో ముగియనున్నాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us