అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 39 ఏళ్ల సదరు మహిళ ఈనెల 12న కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న మహిళ నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అయితే ఆ మహిళ కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్ వచ్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే.







