ఘనంగా నూకాలమ్మ పందిరిరాట మహోత్సవం

కాండ్రకోట (పెద్దాపురం) భక్తుల పాలిట కొంగు బంగారం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనిలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పందిరిరాట మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ ఎలిశెట్టి నాగలక్ష్మీ, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఎలిశెట్టి నాని, ఆలయ కార్యనిర్వాహణాధికారి వీవీ పళ్లంరాజు ఆధ్వర్యంలో ఈకార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ముహూర్తపురాటకు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పళ్లంరాజు మాట్లాడుతూ జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్‌, సర్పంచ్‌ కుంచే గాంధీ, ఉపసర్పంచ్‌ ఎలిశెట్టి చక్రప్రకాష్‌ దేవస్థానం పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us