విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కన్నబాబు అన్నారు. నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమైక్రాన్ ముందస్తు జాగ్రత్తలు, జీవీఎంసీలో పలు సమస్యల పరిష్కారంపై చర్చించామన్నారు. హాయగ్రీవ భూముల వివాదంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. భూముల వివాదాల్లో వైసీపీ నేతలపై బురద చల్లి రాజకీయాలు చేయడం కొందరికి అలవాటుగా మారిందని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.







