హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని డిడ్గీ పద్ద కారు-ద్విచక్రవాహనం ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న దంపతులు, 8 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. బైకును ఢీకొట్టిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. బైకుపై వెళ్తున్న దంపతులు అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన బాలరాజు (28), శ్రావణి (22), చిన్నారి అమ్ములు (8 నెలలు)గా పోలీసులు గుర్తించారు.







