అప్పాపురం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లాలోని కాకుమాను నుంచి బాపట్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అప్పాపురం సమీపంలో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్ళింది. రహదారిపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో బస్సు కమాన్ కట్ట విరగడంతో కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు, విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బాపట్ల ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.







