అమరులైన సైనికుల త్యాగాలు చిరస్మరణీయం

* బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్

UPDATED 19th JUNE 2020 FRIDAY 6:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో వీర జవాన్ల స్థూపం వద్ద అమర వీరుల సంస్మరణ సభ శుక్రవారం జరిగింది. భారత్-చైనా సరిహద్దుల్లో చైనా కుటిలనీతికి బలైన 20 మంది భారత వీర సైనికుల చిత్ర పటాలకు బిజెపి కార్యకర్తలు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన మన వీర సైనికుల త్యాగాలు వృధాకావని, వారి ఆత్మలు శాంతించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం చైనాకు ధీటుగా సమాధానం చెప్తుందని అన్నారు. 1962లో నాటి ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలకు భిన్నంగా ప్రధాని మోడీ సమర్ధ నాయకత్వంలోని భారత ప్రభుత్వం చైనాకు గట్టిగా బుద్ధి చెప్తుందని అన్నారు. అమరులైన జవాన్లు భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. మన కోసం, దేశ రక్షణ కోసం ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను పణంగా   పెట్టి సరిహద్దుల్లో పోరాడుతున్నారని, వారి త్యాగాల వల్లే మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామని వారి సేవలను కొనియాడారు. చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిజెపి  ఎన్.ఆర్.ఐ నాయకులు డాక్టర్ కృష్ణంరాజ్ మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించటం ద్వారా వారు రుణం తీర్చుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎనిమిరెడ్డి మాల కొండయ్య, సూర్యనారాయణ రాజు, పైడా కృష్ణ మోహన్, పైడా భావన ప్రసాద్, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, కాకినాడ సిటీ అధ్యక్షుడు చిట్నీడి శ్రీనివాస్, గట్టి సత్యనారాయణ, పెండెం బాబ్జీ, ఆకుల రామకృష్ణ, గౌరి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us