Groups Jobs: గ్రూప్స్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

UPDATED 18th MARCH 2022 FRIDAY 07:40 PM

Groups Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో గ్రూప్స్ పోస్టుల భర్తీ జరగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన జాబ్ క్యాలండర్ పోస్టులకు అదనంగా ఈ గ్రూప్స్ పోస్టుల భర్తీ జరగనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనుమతి ఇచ్చారు.

దీంతో ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్‌-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది. ఈ పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. గ్రూప్ 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డిఎస్పీ, డి ఎఫ్ ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

గ్రూప్‌-2 లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లు, మున్సిపల్ కమిషనర్లు, ట్రెజరీ అధికారులు తదితర ఖాళీల భర్తీ చేయనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us