ప్రగతిలో ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

UPDATED 26th JANUARY 2018 FRIDAY 5:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైన ఈ వేడుకలలో లెఫ్టినెంట్  జె.డి. నాయుడు ఆధ్వర్యంలో కళాశాల ఎన్.సి.సి విభాగం కవాతు నిర్వహించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామిక దేశంగా గుర్తింపు తెచ్చారని, యువత నూతన పోకడలతో పాటు మన సంస్కృతి, సాంప్రదాయాలను కూడా అవలంభిస్తూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని సాగించాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న సైనిక దళాలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ప్రతీ విద్యార్థి స్వయం వ్యవస్థాపకత కలిగి ఉండాలని, సాంకేతిక రంగంతో పాటు వివిధ రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం కళాశాలకు 10, 15, సంవత్సరాల కాలం పాటు విశేష సేవలంచిన సిబ్బందిని సన్మానించి నగదు ప్రోత్సాహకాలు అందించారు. అలాగే యూనివర్సిటీ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, కళాశాల సిఎ.సి మెంబర్స్ , వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us