UPDATED 27th MAY 2018 SUNDAY 10:00 PM
సామర్లకోట: సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని పిఠాపురం రైల్వేస్టేషన్‌లోని ఓ గుర్తు తెలియని మహిళ ఆదివారం మృతి చెందింది. సామర్లకోట రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని, ఆమె లేత పసుపురంగు చీర ధరించి ఉందన్నారు. ప్రయాణం నిమిత్తం వచ్చి పట్టాలపై పడి మృతిచెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సామర్లకోట రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.







