Minister KTR : న్యూయార్క్ వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న కేటీఆర్.. మీ శ్రమ వృధా కాదంటున్న నెటిజన్లు

UPDATED 26th MARCH 2022 SATURDAY 06:10 PM

KTR America Street Food : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా కొనసాగింది. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఆయన… పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. పెట్టుబడులను పెట్టాలని కోరారు. దీంతో పలు సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే.. న్యూ యార్క్ సిటీలో ఓ మీటింగ్ ముగిసిన అనంతరం వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్న మంత్రి కేటీఆర్ స్ట్రీట్ ఫుడ్ తిన్నారు.

Lexington & 34th వద్ద స్ట్రీట్ ఫుడ్ చూసిసట్లు, అక్కడకు వెళ్లి… వేడి సాస్ తో చికెన్ తో తిన్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ఫొటో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు చేస్తున్న వంటి శ్రమ వృధా కాదు..తెలంగాణ సమాజం కోసం, ప్రజల కోసం ధృఢ సంకల్పంతో పెట్టుబడులు తీసుకురావడానికి చేస్తున్న మీ ప్రయాణం విజయం కావాలని కోరుకుంటున్నట్లు ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఎలాంటి సెక్యూర్టీ లేకుండా సింపుల్ గా భోజనం చేస్తున్న మీరు గ్రేట్ సార్ అంటూ మరొకరు.. తెలంగాణ అభివృద్ధి కోసం మీరు పడుతున్న శ్రమ వృధా కాదంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విషయానికి వస్తే.. ప్రపంచంలోనే టాప్ ఫార్మా కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్ కే అధిపతులతో శనివారం భేటీ అయ్యారు. రీసెర్చ్ డెవలప్ మెంట్ రంగంలో హైదరాబాద్ ఎకోసిస్టంను తెలియచేశారు. హైదరాబాద్ లో టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ సామర్థ్యాలను ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆయా సంస్థల ప్రతినిధులు మెచ్చుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us