శ్రీ ప్రకాష్ లో ధరిత్రీ దినోత్సవం

Updated 22nd April 2017 Saturday 7:00 PM

పెద్దాపురం: స్థానిక రామారావు పేటలో ఉన్న శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ లో శనివారం ఘనంగా 48  వ ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత  పద్మశ్రీ దరిపల్లి రామయ్య హాజరై మాట్లాడారు. దీనిలో భాగంగా పర్యావరణ ఆవశ్యకత, ధరణిని రక్షించుకోవాల్సిన బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే "నేటి మొక్కలే రేపటి వృక్షాలు" అనే నినాదంతో ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి రాధాపాల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు వసంతపల్లవి వసంత ఋతువుల శోభను ప్రతిబింబించే నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. పాఠశాల డైరెక్టర్  సిహెచ్. విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ దరిపల్లి రామయ్య ఉన్నత విద్యలు అభ్యసించకపోయినా ప్రకృతి, వృక్ష జాతుల పట్ల ఎంతో జ్ఞానాభివృద్ధిని పెంపొందించుకున్నారన్నారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ రాజేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us