Updated 27th April 2017 Thursady 2:00 PM
పెద్దాపురం: క్రమశిక్షణకు, నీతి నిజాయితీలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక రాజు గారి వీధిలో ఉన్న ఆర్య వైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన సంస్థాగత ఎన్నికల కార్యక్రమానికి ఆయన హాజరై గురువారం మాట్లాడారు. కష్టించే కార్యకర్తలకు పార్టీలో గౌరవంతో పాటు సముచిత స్థానం లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకర్తలకు క్రమశిక్షణతో పాటు నీతి నిజాయితీలను నూరి పోశారన్నారు. కార్యకర్తల సంక్షేమాన్ని కాంక్షించి వారి సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా శాసన మండలి సభ్యుడు అంగర రామ్మోహనరావు సంస్థాగత ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. ఎన్నికల ప్రక్రియలో పెద్దాపురం పట్టణ, రూరల్ కమిటీల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడిగా రంధి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గా తూతిక రాజు, ఉపాధ్యక్షుడిగా పైలా చిన్నారావు, అలాగే రూరల్ మండల కమిటీ అధ్యక్షుడిగా కొత్తెం వెంకట శ్రీనివాసరావు(కోటి), ఉపాధ్యక్షులుగా సింగన అరవిందకుమార్, మల్లిపూడి శ్రీరామచంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా జి.వి.వి వీర్రాజు, తెలుగు యువత మండలాధ్యక్షుడిగా నూనె రామారావుతో పాటు పలు విభాగాలకు ఎంపికలు జరిగాయి. ఈ సందర్భంగా వీరిని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు( రాజబ్బాయి), పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఎఎంసి వైస్ చైర్మన్ ఎలిశెట్టి నాని, ఎంపిపి గుడాల రమేష్, టిడిపి ఉపాధ్యక్షుడు కమ్మిల సుబ్బారావు, జెడ్పిటిసి సభ్యుడు సుందరపల్లి శివ నాగరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు (రాము), మండల కోఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, కందుల విశ్వేశ్వరరావు, ఆచంట రాజబాబు, మెయిళ్ల కృష్ణమూర్తి పలువురు కౌన్సిలర్లు, అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.







