స్పందన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలి

UPDATED 30th DECEMBER 2019 MONDAY 5:30 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలక్టర్ డి. మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 568 మంది అర్జీదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలక్టర్ మురళీధరరెడ్డి మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో రెవెన్యూ 380, సివిల్ సప్లయి-20, రూరల్ హౌసింగ్-13, ప్రజాసాధికార సర్వే-80, ఆధార్- 40, డిఆర్‌డిఏ పింఛన్లు-15, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్- 20 చప్పున అర్జీలతో పాటు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, కుటుంబ, భూమి తగాదాలు పరిష్కరించాలని, ఉద్యోగ, ఉపాధి కల్పించాలని అర్జీలు వచ్చాయన్నారు. 
రామచంద్రపురం మున్సిపల్ ఏరియా మున్నుమల్లి ఏరియాకు చెందిన శిరిగివీడి శ్రీరామప్రసాద్, సూర్యనారాయణమూర్తులు సర్వే నెం.92-7లో 1-64 సెంట్ల భూమిని అన్నదమ్ములు పంచుకొని రిజిష్టరు చేయించుకొని, ఆ భూమిలో వరి పండించుచున్నామని, సబ్-రిజిష్టార్ కార్యాలయంలో సదరు భూమిని జిరాయితీ పల్లం భూమిగా మార్పు చేయించాలని అర్జీని కలక్టరుకు సమర్పించగా రామచంద్రపురం తహసీల్దారును పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఎల్ల కిషోర్ గత నాలుగు సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని, వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం చేయాలని అర్జీని అందజేయగా, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటరును తగు చర్యలు చేపట్టాలని కలక్టరు ఆదేశించారు.
కాకినాడ రూరల్ వలసపాకలకు చెందిన ఆర్.ఎస్. శ్రీధర్ రైఫిల్ ఘాటింగులో గోల్డ్ మెడల్, కాంస్య పతకం జాతీయస్థాయిలో ఆసియన్ గేమ్స్ లో పాల్గొని సాధించానని, కండరాల బలహీనతతో బాధపడుతున్నానని ఉద్యోగం, ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతూ అర్జీని అందజేయగా, వికాస పిడిని ఉద్యోగ కల్పనకు తగు చర్యలు చేపట్టాలని కలక్టరు ఆదేశించారు.
కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన తిరుమల రామచంద్రరావు రాజుపాలెంలో 1994లో తిరుమల సత్తిరాజు వద్ద సర్వే నెం.99/2లో 0.21 సెంట్లు భూమిని కొనుగోలు చేశానని, దానిని స్వాధీన అగ్రిమెంట్ చేయించుకొన్నామని, రిజిష్టరు చేసుకొనలేదని, ఆ భూమి తిరుమల మంగాలక్ష్మి పేరున నమోదు చేసుకొని అక్రమంగా అతని భూమిలో దిగుచున్నారని రక్షణ కల్పించాలని కలక్టరుకు ఫిర్యాదు చేయగా కిర్లంపూడి తహసిల్దారును విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేటకు చెందిన యడ్ల ముత్యాలరాణి వైఎస్ఆర్ పెళ్లి కానుక పధకంలో వివాహానికి దరఖాస్తు చేసుకొన్నానని, పెళ్లి కానుక సొమ్ము ఇప్పించాలని కలక్టరుకు అర్జీని అందజేయగా, డిఆర్డీఏ పిడిని పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన కుంచే సత్యనారాయణ, ఎం.దేవరాజ్, జి. సత్యనారాయణ, తదితరులు తమ గ్రామంలో మురుగు కాలువకు ఆనుకొనియున్న శ్మశాన భూమిని అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామానికి చెందిన నడింపల్లి రామలింగరాజు ఆక్రమించి కొబ్బరి మొక్కలు వేయడం వల్ల శవ సమాధులకు అంతరాయం కలిగిస్తున్నారని ఫిర్యాదు చేయగా, ఉప్పలగుప్తం తహసీల్దారును విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తూర్పుగోదావరి జిల్లా తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బంది నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని ఉద్యోగ భద్రత కల్పించాలని, ఔట్ సోర్సింగ్ పరిధిలోకి వారిని తీసుకోవాలని పి. శ్రీను, పి. శ్రీరామ్, ఎన్. ఆనందబాబు, తదితరులు జెసికి అర్టీని అందజేయగా డిఎమ్&హెచ్ఓను పరిశీలించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్-2 జి. రాజకుమారి, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, బిసి కార్పోరేషన్ ఇడి ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us