Updated 2 February 2022 Wednesday 01:45 PM
రాజవొమ్మంగి (రెడ్ బీ న్యూస్): రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు. లోదొడ్డిలో కల్తీ కల్లు తాగిన ఐదుగురులో నలుగురు మృతి చెందటంతో గ్రామంలో విషాద చాయలు నెలకొంది. కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారిలో వేమ లోవరాజు (28), చెదల సుగ్రీవ్ (70), లు బుసరి సన్యాసిరావు (65), పుత్తూరు గంగరాజు(36) ఉన్నారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఏసుబాబు పరిస్థితి విషమంగా ఉంది. ఈరోజు ఉదయం కల్తీ కల్లు తాగిన ఐదుగురుకి కడుపులో మంట, వాంతులు అయ్యాయి. అనంతరం కొద్ది సేపటికే నలుగురు మృతి చెందారు. కల్తీ కల్లుపై జడ్డంగి పోలీసులు విచారణ చేపట్టారు.







