UPDATED 10TH MAY 2017 WEDNESDAY 2:00 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఏ. మల్లికార్జున బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి-2 జె. రాధాకృష్ణమూర్తి, డిఆర్వో ఎం.జ్యోతి, పలువురు జిల్లా అధికారులు ఆయనను కలుసుకుని అభినందనలు తెలియచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా పనిచేసే అవకాశం లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు రెవిన్యూ, పౌరసరఫరాల పరంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో తాను మదనపల్లి డివిజన్ సబ్ కలెక్టర్ గా సిఆర్డీఎ అదనపు కమీషనర్ గా పనిచేసిన అనుభవం ఇందుకు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశం మేరకు జూన్ ఒకటి నాటికి జిల్లాను పొగరహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు అర్హులైన వారందరికి ఉజ్వల, దీపం పథకాల కింద వంట గ్యాస్ పంపిణి తనముందున్న తక్షణ లక్ష్యం అన్నారు. సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు డయల్ యువర్ జెసి కార్యక్రమాలను కొనసాగిస్తానన్నారు.







