శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో మంగళవారం రాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. రత్తకన్న, తేలుకుంచి, అమీన్సాహిబ్ పేట, పురుషోత్తపురం గ్రామాల్లో, ఇచ్ఛాపురం సమీప ఒడిశా ప్రాంతంల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పది నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. దీంతో ప్రజలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటికి వచ్చి పరుగులు తీశారు.







