శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో పాలు, బిస్కట్లు పంపిణి

UPDATED 24th NOVEMBER 2017 FRIDAY 9:00 PM

బిక్కవోలు:  రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందిన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో వేంచేసివున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి సుబ్రమణ్య షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామం శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో బిక్కవోలు శ్రీ వల్లీ దేవసేనా సమేత కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం వృద్దులు, చంటిపిల్లలకు పాలు, బిస్కట్లు పంపిణీ చేసినట్లు సమితి అధ్యక్షులు తోటకూర గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదబ్రహ్మదేవం గ్రామంలోని రైతులు, భక్తులు నుంచి స్వచ్చంధంగా సేకరించిన సుమారు 350 లీటర్ల పాలను ఆలయం వద్ద భక్తులకు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవాధ్యక్షులు వింజమూరి సుబ్రమణ్య శర్మ, కార్యదర్శి విశ్వనాథ్, సభ్యులు టి.వి.వి. సత్యనారాయణ, పెంటపాటి మల్లికార్జునరావు, నువ్వుల బాబ్జి, తోట వెంకటరమణ, నువ్వుల వెంకట్రాజు, మాచారావు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us