హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భాజపా ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ రేపు భేటీ కానున్నారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో రేపు ఉదయం 9.30 గంటలకు వారు సమావేశం కానున్నారు. రేపు ఉదయం అల్పాహార విందుకు తెలుగు రాష్ట్రాల భాజపా ఎంపీలను మోదీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ లోక్‌సభ, రాజ్యసభ భాజపా ఎంపీలు హాజరుకానున్నారు.







